దలైలామాకు లైంగిక వేధింపుల కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ తో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను దలైలామా కార్యాలయం ఖండించింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దలైలామా ఎన్నడూ ఎప్‌స్టీన్‌ను కలవలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయన తరపున మరెవరూ కూడా ఎప్‌స్టీన్‌తో సమావేశం అయ్యేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కార్యాలయం పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, వాటిలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతం కావడంతో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎప్‌స్టీన్ తో ఉన్న సంబంధాలు, సంభాషణల వివరాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ప్రస్తావనకు రావడంతో చర్చ మొదలైంది. అయితే తమ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని దలైలామా కార్యాలయం తోసిపుచ్చింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన సుమారు 30 లక్షల ఫైళ్లను విడుదల చేసింది. ఇందులో 2,000కు పైగా వీడియోలు, దాదాపు లక్షా ఎనభై వేల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తదిర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
జెఫ్రీ ఎప్‌స్టీన్ తో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఖండించిన దలైలామా కార్యాలయం
February 08, 2026
0
Tags