ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మీడియా పాయింట్‌లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్బుద్ధి అంటూ దుయ్యబట్టారు. హోంమంత్రి వచ్చి ఏదోదో మాట్లాడుతున్నారు. మేం కూడా వాస్తవాలు తేల్చాలనే సభలో చర్చించమని కోరుతున్నామని బొత్స అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది. దోచుకోవడమే హెరిటేజ్ ఆలోచన. ఎందుకు సభలో చర్చించడానికి ఈ ప్రభుత్వానికి భయం. సభలో బడ్జెట్‌తో పాటు ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే. ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ఇది. మేం చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రండి. మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం అంటూ బొత్స సవాల్ విసిరారు.
ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్బుద్ధి !
February 18, 2026
0
Tags