గణితంలో ఏఐ ఏమాత్రం ఖచ్చితత్వాన్ని పాటించడంలేదు !

Telugu Lo Computer
0


మెరికాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన లాజిక్ ప్రొఫెసర్, ప్రముఖ గణిత శాస్త్రవేత్త జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గణిత పరిశోధనల్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎంఎస్‌)కు ఏఐ ఏమాత్రం ఉపయోగపడటం లేదని, అవి ఇచ్చే సమాధానాలు పరమచెత్తగా ఉంటున్నాయని విమర్శించారు. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ తాను అనేక పెయిడ్ ఏఐ మోడల్స్‌తో ప్రయోగాలు చేశానని, అయితే గణితంలో అవి ఏమాత్రం ఖచ్చితత్వాన్ని పాటించడం లేదని స్పష్టం చేశారు. గణితంలో ఏఐ వ్యవస్థలు తప్పులు చేయడమే కాకుండా, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు అవి ప్రవర్తించే తీరు మరింత విస్మయానికి గురిచేసిందని హామ్కిన్స్‌ పేర్కొన్నారు. గణిత తర్కంలో స్పష్టమైన పొరపాట్లు ఉన్నాయని ఏఐకి తెలియజేసినా, అవి ఎంతో ఆత్మవిశ్వాసంతో 'అదంతా సరిగ్గానే ఉంది' అంటూ మొండిగా సమాధానమిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు వారు ఇలాంటి తప్పుడు వాదనలు చేస్తే, తాను ఇకపై వారితో మాట్లాడేందుకు నిరాకరిస్తానని జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ అన్నారు. ఏఐ ఇచ్చే తప్పుడు సమాధానాలు పరిశోధకుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default