ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బోపాలపట్నం-ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇన్‌చార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారంతో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు, సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు ఈ నెల 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ సమయంలో జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతులను దిలీప్ బెండ్జా (రూ.8 లక్షల రివార్డు), మాధవి కోసా (రూ.5 లక్షలు), పాలో పోడియం (రూ.5 లక్షలు), లఖీ మద్కం (రూ.5 లక్షలు), జుగ్లో బంజం (రూ.2 లక్షలు), రాధా మెట్ట (రూ.2 లక్షలు)గా గుర్తించారు. వీరిపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పత్తిలింగం వెల్లడించారు. కీలక నేత దిలీప్ బెండ్జాపై బీజాపూర్ జిల్లాలో 135కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్, రెండు 0.303 రైఫిళ్లు, ఒక కార్బైన్‌తో పాటు పేలుడు పదార్థాలు, వైర్‌లెస్ సెట్లు, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టు మృతి
January 19, 2026
0
Tags