భారత్‌పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధం : మసూద్ అజార్‎ ఆడియోలో హెచ్చరిక

Telugu Lo Computer
0


భారత్‌పై దాడులు చేయడానికి వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని జైష్-ఎ-మొహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‎ ఆడియోలో హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఆడియోలో మసూద్ అజర్ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వెయ్యి కంటే ఎక్కువే ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని ఆ ఆడియోలో పేర్కొన్నాడు. తాను గనుక పూర్తి సంఖ్యను వెల్లడిస్తే రేపు అంతర్జాతీయ మీడియాలో పెద్ద దుమారం రేగుతుంది అని పేర్కొన్నాడు. భారత్‌లోకి చొరబడి దాడులు చేయడానికి తన అనుచరులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, వారు రక్తపాతానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఆడియోలో మసూద్ అజార్ చెబుతున్నట్లుగా వినిపించింది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత దళాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి. అందులో భాగంగా పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశాయి. ఇందులో మసూద్ అజర్ సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మంది హతం అయ్యారు. దానికి ప్రతీకారంగానే ఈ తాజా హెచ్చరికలు వచ్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మారణకాండ వెనుక కూడా జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో పట్టుబడ్డ ఉమర్ మహమ్మద్ అనే నిందితుడికి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default