ఇరాన్‌లో రోజురోజుకు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ భారత పౌరులకు కీలక సూచన చేసింది. ఇరాన్‌లో పెరుగుతున్న అస్థిరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని స్టూడెంట్స్, టూరిస్టులు, వ్యాపారవేత్తలను కోరింది. వెళ్లే పరిస్థితి లేని వారు జాగ్రత్తగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పింది. ప్రయాణ, గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. సహాయం కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది. ఇరాన్‌లో ఉన్న భారత పౌరులందరూ తమ ప్రయాణ డాక్యుమెంట్లు, పాస్‌పోర్టులు, గుర్తింపుకార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఏదైనా సహాయం కోసం తమను సంప్రదించాలని సూచించింది. తక్షణ సహాయం కోసం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాను విడుదల చేసింది. మొబైల్ నంబర్‌లు: +989128109115, +989128109109, +989128109102, +989932179359; ఈమెయిల్: cons.tehran@mea.gov.in.
ఇరాన్‌లోని భారత పౌరులకు కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
January 14, 2026
0
Tags