దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో మరోసారి తన సత్తా చాటింది. కేవలం ధర మాత్రమే కాకుండా అద్భుతమైన మైలేజ్, లగ్జరీ ఫీచర్లలో 2025 డిసెంబర్ లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానానికి చేరుకుంది. డిసెంబర్ లో బాలెనో ఏకంగా 22,108 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మారుతి ఫ్రాంక్స్ (20,700 యూనిట్లు), టాటా నెక్సాన్ (19,400 యూనిట్లు) వంటి పాపులర్ మోడళ్లను కూడా దాటేసి నంబర్ 1 కారుగా నిలిచింది. గత ఐదు నెలలుగా నెలకు సగటున 13,000 యూనిట్లు అమ్ముడవుతుండగా, డిసెంబర్‌లో ఒక్కసారిగా ఈ స్థాయిలో పెరగడం విశేషం. సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై ప్రభుత్వం పన్ను తగ్గించింది. దీనివల్ల బలేనో ధర సుమారు రూ. 86,000 వరకు తగ్గింది. ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అన్ని హంగులు ఉన్న ఆల్ఫా ఏఎంటీ వెర్షన్(టాప్ ఎండ్ మోడల్) రూ. 9.10 లక్షల లోపే లభిస్తోంది. మైలేజ్ విషయంలో బలేనో తిరుగులేని రేటింగ్‌ను అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 22.94 కి.మీ ఇస్తోంది. సీఎన్జీ వేరియంట్ ఏకంగా 30.61 కి.మీ ఇస్తోంది. దాదాపు ఒక సాధారణ బైక్ ఇచ్చే మైలేజీని ఈ కారు అందిస్తోంది. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడేవారికి ఇది వరం లాంటిదని చెప్పవచ్చు. తక్కువ ధరకే బాలెనోలో ఎన్నో హై-ఎండ్ ఫీచర్లను మారుతి చేర్చింది. 360-డిగ్రీ కెమెరాను ఈ కారులో మారుతి అమర్చింది. ఇరుకైన సందుల్లో పార్కింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. డ్రైవర్ రోడ్డు మీదే దృష్టి సారించేలా స్పీడ్, నావిగేషన్ వివరాలను విండ్‌షీల్డ్ పైనే చూసేలా హెడ్స్-అప్ డిస్ప్లేను ఏర్పాటు చేసింది. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అలెక్సా సదుపాయం ఉంది. భద్రత పరంగా అనేక సదుపాయాలను కల్పించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP హిల్-హోల్డ్ అసిస్ట్, భారత్ NCAPలో మెరుగైన రేటింగ్ దీనికి లభించాయి. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు లగ్జరీ లుక్ ఇస్తుంది.
దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకి బాలెనో
January 05, 2026
0
Tags