ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు చలి వాతావరణం, పొగమంచు కారణంగా అంతరాయం కలిగింది. దీంతో 70కి పైగా విమానాలని ఆయా విమాన సంస్థలు రాకపోకల్ని రద్దు చేశాయి. ఈ సందర్భంగా ప్రయాణీకులకు ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం అడ్వైజరీ నోట్‌ను జారీ చేసింది. దృశ్యమానత సరిగ్గా లేనికారణంగా అమృత్‌సర్‌, జబల్‌పూర్‌, జలంధర్‌లలో విమానాల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. సాధారణం కంటే కూడా విమానాలు తక్కువ సంఖ్యలోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని ఇండిగో విమానయాన సంస్థ జారీ చేసిన నోట్‌ పేర్కొంది. ప్రయాణీకులు తమ విమాన స్థితిని గమనిస్తూ ఉండాలని ఆ సంస్థ ప్రయాణీకులకు సూచించింది. ప్రయాణీకులు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా లేక టికెట్‌ను వాపస్‌ చేసుకోవాలనుకున్నా వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలని ఇండిగో తెలిపింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default