డిసెంబర్ 31లోపు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీంతో ఐటీ రిటర్నులు, రీఫండ్లు, బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. పాన్ నిష్క్రియమైతే టీడీఎస్/టీసీఎస్ ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. కేవైసీ సమస్యలతో బ్యాంక్ ఖాతాలు కూడా నిలిచిపోవచ్చు. సీబీడీటీ మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ పొందినవారు డిసెంబర్ లోపే లింక్ చేయడం తప్పనిసరి.
జనవరి నుంచి ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు : ఆదాయపు పన్ను శాఖ
December 07, 2025
0
Tags