తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా సేవలందిస్తున్న డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ మెడలియన్‌తో పాటు కాంగ్రెస్ ప్రొక్లమేషన్‌ను ప్రదానం చేశారు. ఈ అరుదైన గౌరవ కార్యక్రమం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో అధికారికంగా జరిగింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు, ఇల్లినాయిస్ రాష్ట్రం ఫస్ట్ కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌మన్ జోనాథన్ ఎల్. జాక్సన్ ఈ పురస్కారాలను అందజేశారు. సమాజ సేవ, అంతర్జాతీయ దౌత్యం, గ్లోబల్ అభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి మాత్రమే ప్రదానం చేసే కాంగ్రెస్ మెడలియన్‌ను డాక్టర్ ఖాన్‌కు అందజేయడం విశేషం. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇచ్చే కాంగ్రెస్ ప్రొక్లమేషన్‌ను కూడా ఆయనకు మంజూరు చేశారు. ఈ ప్రొక్లమేషన్ అమెరికా కాంగ్రెస్ అధికారిక రికార్డుల్లో శాశ్వతంగా నమోదు కానుంది. "దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ సహకారం, సుస్థిర అభివృద్ధి, వాణిజ్య సంబంధాల పెంపులో ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. ఈ గౌరవాలను ఆయనకు అందజేయడం గర్వకారణం" అని ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్‌మన్ జోనాథన్ ఎల్. జాక్సన్ వ్యాఖ్యానించారు.
డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ మెడలియన్, ప్రొక్లమేషన్ ప్రదానం
December 13, 2025
0
Tags