జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ : పలువురికి స్వల్ప గాయాలు

Telugu Lo Computer
0


మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెం చేరుకున్న వైఎస్‌ జగన్‌ కు కార్యకర్తలు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, వృద్ధులు తరలి వచ్చారు. ఇదిలాఉంటే.. ఆకునూరు సెంటర్ కు చేరుకున్న జగన్ మోహన్ రెడ్డి కల్లుగీత కార్మికులు కలిశారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుతి ఇచ్చారు. అంతేకాదు రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటనకు రావొద్దని మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default