తల్లి ఎమ్మెల్యే, తండ్రి రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు : ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రిగా అయిన కుమారుడు

Telugu Lo Computer
0


బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బృందంలో 26 మంది మంత్రులుగా చోటు సంపాదించుకున్నారు. క్యాబినెట్ మంత్రుల జాబితాలో 12 మంది పేర్లు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఇందులో ముఖ్యంగా ఓ మంత్రి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఆ మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అలాగని ఎమ్మెల్సీ కూడా కాదు. అయినా మంత్రిగా చోటు సంపాదించారు.  రాష్ట్రీయ లోక్ మోర్చా బీహార్‌లోని బాజ్‌పట్టి, మధుబని, ససారం, దినారా, ఉజియార్‌పూర్, పారుతో సహా ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో మహతో బాజ్‌పట్టి నుంచి రామేశ్వర్ కుమార్, మధుబని నుంచి మాధవ్ ఆనంద్, ససారమ్ నుంచి స్నేహలత, దినారా నియోజకవర్గం నుంచి అలోక్ కుమార్ సింగ్ గెలుపొందారు. ససారమ్ ఎమ్మెల్యే స్నేహలత రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా భార్య. అయితే ఎమ్మెల్యే స్నేహలత, ఉపేంద్ర కుష్వాహా కుమారుడు దీపక్ ప్రకాష్. నిన్న బీహార్ రాష్ట్ర మంత్రిగా దీపక్ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. తల్లి ఎమ్మెల్యే, తండ్రి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ.. దీపక్ మాత్రం విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఎలాంటి పదవి లేకుండా డైరెక్ట్ మంత్రి అయ్యారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default