వచ్చే జనవరి 28 నుంచి 31వరకు నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహా జాతరకు నాలుగు వేల బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడారం జాతరకు కావలసిన రోడ్ల అభివృద్ధి పనులను, భక్తులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడం పైన దృష్టి సారించిన ప్రభుత్వం ఈ మేరకు తగు చర్యలు తీసుకుంటుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగువేల బస్సులను నడుపుతామని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్, వరంగల్ ఆర్ఎండి వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన మేడారంలో పర్యటించి వై జంక్షన్ లో కొత్తగా నిర్మించబోయే బస్టాండ్ కు భూమి పూజ చేశారు. భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మేడారం మహా జాతర నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఇదే విషయాన్ని ములుగు డిఎంహెచ్ఓ గోపాలరావు వెల్లడించారు. మేడారం జాతరలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు కోసం కూడా ఆయన స్థల పరిశీలన చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆయన స్థల పరిశీలన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఇక మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సుమారు 1050 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం మేడారం మహా జాతరకు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మేడారం మహా జాతరకు నాలుగు వేల బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం
November 07, 2025
0
Tags