ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అనునయ్ సూద్ ఆకస్మిక మృతి !

Telugu Lo Computer
0


ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్‌ లాస్ వెగాస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, గ్లోబల్‌ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు సందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్‌ కంటెంట్‌, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో  అనునయ్ సూద్‌ చోటు సంపాదించుకున్నాడు. లాస్‌ వెగాస్‌లో స్పోర్ట్స్‌ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్‌ ఆయన చివరి పోస్ట్‌. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default