ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. బలగాల ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.
0 Comments