బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు !

Telugu Lo Computer
0


బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.  నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని వ్యాఖ్యానించిన కోర్టు, ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు. కాగా, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా గురువారం ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గుంటూరు నగరానికి చెందిన ఈయన.. కేంద్ర మంత్రిగా పనిచేసిన రాందాస్ అఠావలె అనుచరుడిగా చెప్పుకొంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. జగన్ను అన్నా అంటూ తాను పులివెందులకు చెందినవాడినేనంటూ వైసీపీ నేతలతో తిరిగాడు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా, పలు యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లే టార్గెట్ గా దుర్భాషలతో విరుచుకుపడ్డాడు. వైసీపీ అధినేత జగన్ భజనే పరమావధిగా వీరిపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ హల్చల్ చేశాడు. జగన్ పేరు చెబుతుండడంతో పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిని వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు పరారయ్యాడు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పలుచోట్ల కేసులు నమోదు కాగా పోలీసులు బోరుగడ్డను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default