తెలంగాణ ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో నిరసనలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి కాలేజీల్లో క్లాసుల బంద్ చేయాలని యాజమాన్యాల నిర్ణయం తీసుకున్నాయి. వారం తర్వాత నిరవధిక బంద్ కు వెళ్తామని ప్రకటించాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీల్లో క్లాసులు బంద్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సుమారు రూ.6,000 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్ లో పడ్డాయి. గత ఏడాది డిసెంబరు 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ ఫీజులను చెల్లించాల్సిందేనంటూ విద్యార్థులపై ఆయా కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.
రేపటి నుంచి తెలంగాణలో ఫార్మసీ కాలేజీల్లో క్లాసులు బంద్ !
October 16, 2024
0
Tags