Ad Code

జమ్మూ కాశ్మీర్‌ భారీ అగ్నిప్రమాదంలో 68 ఇళ్లు దగ్ధం !


మ్మూ కాశ్మీర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలిపోవడంతో నివాసితులు రోడ్డు పాలయ్యారు. స్పందించిన అధికారులు బాధితులకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం కిష్త్వార్‌లోని ముల్వార్వాన్ గ్రామంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 68 ఇళ్లు కాలిపోయాయి. దీంతో వందలాది నివాసితులు కట్టుబట్టలతో మిగిలారు. చలి వాతావరణం నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు కోరారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు స్పందించారు. అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి తాత్కాలిక టెంట్లలో ఆశ్రయం కల్పించారు. బాధిత కుటుంబాలకు ఆహారం, దుస్తులు, వైద్య, సహాయక సామగ్రిని అందించినట్లు కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు పునరావాసాన్ని కల్పించే చర్యలు చేపడతామని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu