సర్వీస్‌లో నంబర్‌ 1గా ఒప్పో !

Telugu Lo Computer
0


భారత్‌లో సేల్స్‌ తర్వాత సర్వీస్‌పై రాజీపడకుండా అత్యుత్తమ అనుభవాన్ని అందించే స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థగా ఒప్పో ఇండియా నిలిచింది. 62 శాతం మంది ఒప్పో కస్టమర్లు ఈ సర్వీస్‌లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా సంతృప్తికరం అంటూ రేటింగ్‌ ఇచ్చారు. ఒప్పో ఇండియా, రియల్‌మి, శాంసంగ్, వివో, షియోమీ వంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ల సేల్స్‌ తర్వాత సర్వీస్‌ అనుభవాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ సర్వే నిర్వహించింది. ఆగస్టు 2024లో ఈ సర్వేను చేపట్టింది. ఇందులో ఒప్పో ఇండియా తొలి స్థానంలో నిలిచింది. దేశంలోని 13 టైర్‌ 1, టైర్‌ 2 నగరాల్లో కౌంటర్‌పాయింట్‌ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో సుమారు 2000 మంది వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. రిపేర్‌ క్వాలిటీ, రిపేర్‌ ఖర్చులు, పారదర్శకత, వేగం, సిబ్బంది సైపుణ్యం, కమ్యూనికేషన్ వంటి కీలక అంశాల్లో ఒప్పో కస్టమర్లు చాలా సంతృప్తికరం అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 62 శాతం వినియోగదారులు అత్యంత సానుకూలమైన రేటింగ్‌ ఇచ్చారు. ఫలితంగా ఒప్పో ఇండియా సేల్స్‌ తర్వాత సర్వీస్‌లో అంచనాలను మించిందని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి. ఒప్పో అనంతరం 58 శాతంతో వివో, 57 శాతంతో శాంసంగ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 78 శాతం కస్టమర్‌లు తమ పరికరాల మరమ్మతులను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతించడం ద్వారా ఒప్పో ఇండియా మరింత పారదర్శకంగా వ్యవహరించింది. ఒప్పో ఇండియా కేవలం గంట వ్యవధిలోనే 35 శాతం వినియోగదారుల సమస్యలను పరిష్కరించింది. 34 శాతంతో శాంసంగ్‌ రెండో స్థానంలో ఉంది. ఒప్పో ఇండియా కస్టమర్లలో 57 శాతం మంది సర్వీస్‌ సెంటర్‌లోని మరమ్మతుల నాణ్యతపై సంతోషంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇందులో 52 శాతంతో వివో రెండో స్ధానంలో ఉంది. అదనంగా 51 శాతం మంది ఒప్పో ఇండియా కస్టమర్లు రిపేర్‌ ఖర్చులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విభాగంలో 45 శాతంతో షియోమీ, వివో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సర్వీస్‌ సమయంలో కస్టమర్‌లకు అనుకూలమైన భాషతో సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది.. 48 శాతం వినియోగదారుల మెప్పు పొందారు. మరియు ఒప్పో ఇండియా సర్వీస్‌ సెంటర్ల సిబ్బంది తమ పరిజ్ఞానంతో 56 శాతం వినియోగదారులను ఆకట్టుకున్నారు. ఈ విభాగంలో శాంసంగ్, వివో 49 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. 500 పైగా నగరాలు, పట్టణాల్లో.. పారదర్శకమైన, వేగవంతమైన, అనుకూలమైన ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్ల కలిగి ఉన్న ఒప్పో.. 51 శాతం మద్దతును పొందింది. ఈ విభాగంలో వివో 46 శాతం వద్ద ఉంది. సేల్స్‌ తర్వాత మెరుగైన సర్వీస్‌ అందించేందుకు వీలుగా 2022 లో ఒప్పో ఇండియా తన 3.0 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకమైన సేవలు అందించేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల్లో కేవలం తమ పరికరాలను మరమ్మతులు చేయించుకోవడమే కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులపై నిపుణులతో నేరుగా చర్చించేందుకు కూడా అవకాశం ఉంటుంది. సేల్స్‌ తర్వాత సర్వీస్‌లో మొదటి స్థానానికి చేరుకోవడంలో కచ్చితమైన విధానాన్ని అనుసరిస్తోంది. ఇది మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టిపెడుతోంది. 25,000 పైగా పిన్‌కోడ్‌లలో 560 పైగా ప్రత్యేక సర్వీస్‌ సెంటర్‌లతో ఒప్పో ఇండియా మెరుగైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. విస్తారమైన నెట్‌వర్క్‌తో తమ కస్టమర్‌లకు సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఒప్పో ఇండియా సేల్స్‌ తర్వాత సర్వీస్‌ భౌతిక సేవా కేంద్రాల నుంచి డిజిటల్‌ రంగానికీ విస్తరించింది. భారత్‌లోనే తొలి డిజిటల్‌ సర్వీస్‌గా 'ఒప్పో సెల్ఫ్‌-హెల్ప్‌ అసిస్టెంట్‌' గుర్తింపు పొందింది. భారత్‌ ప్రభుత్వ Right To Repair విధానాలకు అనుగుణంగా ఈ డిజిటల్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరమ్మతుల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించేందుకు వీలుగా రూపొందించబడింది. దీనిని మార్చి 2024లో ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాల్లో విడుదలైన A, F, K, రెనో మరియు ఫైండ్‌ సిరీస్‌లను కవర్‌ చేస్తుంది. సర్వీస్‌ సెంటర్‌లను నేరుగా సందర్శించే అవసరం లేకుండా ఒప్పో సెల్ఫ్‌ హెల్ప్ అసిస్టెంట్‌.. స్పార్ట్‌ఫోన్‌ సమస్యలను పరిష్కరించడంలో వినియోగదారులకు సాయం చేస్తుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ను పెంచేందుకు హార్డ్‌వేర్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ముఖ్య భూమిక పోషిస్తుండగా.. ఒప్పో మాత్రం వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు ముందడుగు వేసింది. విక్రయాలతోపాటు సేల్స్‌ తర్వాత సర్వీసులు కూడా ఎంతో అవసరం అని ఒప్పో ఇండియా భావిస్తోంది. వినియోగదారుల ఉత్పత్తులకు జీవితకాలం పొడిగించేందుకు సేల్స్‌ తర్వాత సర్వీస్ ఉపయోగపడతాయని ఒప్పో ఇండియా విశ్వసిస్తోంది. మరమ్మతు సేవల ధర తగ్గించడం మరియు సాంకేతికతను మరింత అందుబాటులో ఉంచడం వంటి స్థిరమైన లక్ష్యాలను ఒప్పో ఇండియా నిర్దేశించుకుంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default