నా పేరు పై ఉన్న ఫేక్ అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నా : ఆర్కే రోజా

Telugu Lo Computer
0


నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ ఆర్కే రోజా సుదీర్ఘ హెచ్చరిక ట్విట్టర్ వేదికగా మెసేజ్ పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం! నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter, #threads మాత్రమే వాడుతున్నాను, నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్లను డిలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ (బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను' అని ఆమె పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default