షూటర్ మను భాకర్, అథ్లెట్ నీరజ్ చోప్రా మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్స్ విన్ అయి దేశానికి గర్వకారణంగా నిలిచారు. వారి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ ఈ టోర్నమెంట్ తర్వాత వీరు చాలా మంచి స్నేహితులు అయినట్లు తెలుస్తోంది. వీరి స్నేహం మరింత బలపడిందని మను భాకర్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఇటీవల స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ 2024 డైమండ్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ఆడేటప్పుడు అతడి చేతికి గాయం అయింది. ఈ విషయాన్ని నీరజ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ ద్వారా వెల్లడించాడు. అప్పటినుంచి అతడు త్వరగా కోలుకోవాలని చాలామంది విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ షూటర్ మను భాకర్, నీరజ్‌కు చాలా ప్రేమగా ఒక మెసేజ్ పంపింది. ఆమె స్పెషల్ విషెస్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన ఎడమ చేతిలో ఓ ఎముక విరిగిందని సెప్టెంబర్ 15న నీజర్ తెలిపాడు. దానికి సంబంధించిన ఒక ఎక్స్-రే పిక్ కూడా పోస్టులో యాడ్ చేశాడు. గాయం వల్ల, 2024 సంవత్సరంలో బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో సరిగా ఆడలేకపోయారు. అయినా, జావెలిన్ త్రో పోటీలో రెండో స్థానం సంపాదించాడు. విజేత ఆండర్సన్ పీటర్స్ కంటే కేవలం 1 సెంటీమీటర్ తక్కువ దూరం ఈటెను విసిరాడు. ఈ సక్సెస్‌ను మను పొగుడుతూనే గాయం నుంచి త్వరగా రికవర్ కావాలని ఆశించింది. మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ ట్వీట్‌ను రీకోట్ చేస్తూ "నీరజ్ చోప్రా, 2024 సీజన్లో అద్భుతంగా ఆడినందుకు నీకు కంగ్రాట్యులేషన్స్. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ విజయాలు సాధించాలని ఆశిస్తున్నా," అని పేర్కొంది. ఆమె నీరజ్ గురించి పెట్టిన ట్వీట్ 2 లక్షల 55 వేలకు పైగా వ్యూస్‌తో వైరల్ అయింది. దీనికి ఇప్పటికే 12వేల వరకు లైక్స్ వచ్చాయి. ఒక ఛాంపియన్ మరొక ఛాంపియన్ విష్ చేస్తోంది.. ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అంటూ చాలామంది ఈ పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు. చిన్నగాయమే కదా త్వరగా నేను రికవరీ అవుతావులే అని మరికొంతమంది ధైర్యం చెబుతున్నారు.
నీరజ్ చోప్రాకు గాయం - మను భాకర్ ట్వీట్ - సోషల్ మీడియా పోస్ట్ వైరల్ !
September 16, 2024
0
Tags