Ad Code

వాట్సాప్ లో సెలబ్రిటీస్ వాయిస్ తో చాట్ ఫీచర్ ?


మెటా ఏఐ వాయిస్ ఫీచర్ తో ప్రముఖుల వాయిస్‌ లను ఉపయోగించి వాట్సాప్ లో చాట్ చేసుకోవడానికి వీలు కల్పించబోతోంది. నలుగురు ప్రముఖుల వాయిస్ లను దీనిలో అప్ డేట్ చేస్తారు. అయితే ఆ ప్రముఖులు ఎవ్వరు అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా మెటా సంస్థ తన ఇన్ స్టంట్ మేనేజింగ్ యాప్ వాట్సాప్‌ కు టూవే వాయిస్ చాట్ ఏఐ ఫీచర్ ను జోడించనుంది. దీని ద్వారా వినియోగదారులు వాయిస్ చాట్ లో కొత్త అనుభవం పొందవచ్చు. ప్రముఖుల వాయిస్ ను నియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది . మెటా సంస్థ ఏఐకి సంబంధించిన వివిధ వాయిస్ ఆప్షన్లపై పనిచేస్తోంది. ఈ కొత్త వాయిస్ ఫీచర్ లో ప్రముఖుల వాయిస్ లు ఉంటాయి. అలాగే వివిధ రకాల పిచ్, టోనాలిటీ, యాక్సెంట్ తో విభిన్న స్వరాలను అందించనుంది. వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ను టూ వే వాయిస్ చాట్ ఫీచర్‌కు అనుసంధానం చేసి, అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. దీని ద్వారా ప్రముఖ వ్యక్తుల వాయిస్‌లతో యూజర్లు ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది. అంటే ఇతరులు మెసేజ్ చేసినప్పుడు మీరు చాటింగ్ కి బదులుగా సెలబ్రిటీలకు సంబంధించిన వాయిస్ లతో మీరు చాట్ ని కొనసాగించవచ్చు. అయితే ఈ వాయిస్ చాట్ ఫీచర్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్‌ లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలో వినియోగదారులందరూ ప్రసిద్ధ వ్యక్తులతో సహా పలు రకాల వాయిస్‌ లకు యాక్సెస్‌ పొందే అవకాశం ఉంది. యూకే, యూఎస్ యాసలతో సహా అనేక స్వరాలను ఎంచుకోగలుగుతారు. గత ఏడాది మెటా మెసెంజర్ లో కస్టమ్ ఏఐ చాట్ బాట్ ను ప్రవేశపెట్టింది.

Post a Comment

0 Comments

Close Menu