హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈసారి శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శమివ్వనున్నారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా నేరుగా సీఎం పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి ప్రతిమను చూసేందుకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పోలీసులు, అధికారులు చేశారు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు ?
September 07, 2024
0
Tags