Ad Code

యూట్యూబ్‌ ఫ్యామిలీ సెంటర్‌ ఫీచర్‌ !


చిన్నారుల యూట్యూబ్‌ పర్యవేక్షణ వారి తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా అప్‌గ్రేడ్‌ ఫీచర్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కువ మంది చిన్నారులు ఈ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాంను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్‌ను ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. యూట్యూబ్‌ ఫ్యామిలీ సెంటర్‌ పేరుతో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. చిన్నారుల యూట్యూబ్‌ నియంత్రణ పూర్తిగా వారి తల్లిదండ్రుల చేతుల్లోనే ఉండనుంది. వారు అప్‌లోడ్‌ చేసే వీడియోలు, చూసే వీడియోలు, కామెంట్‌లపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. ఇందుకు చిన్నారుల యూట్యూబ్‌ అకౌంట్లను వారి తల్లిదండ్రులు తమ ఖాతాలకు లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నారుల ఖాతాలను తమ యూట్యూబ్‌ అకౌంట్లకు లింక్‌ చేసిన వెంటనే.. చిన్నారులు తమ అకౌంట్లలో వీడియోలు అప్‌లోడ్‌ చేసినా లేదా లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభించినా.. ఈమెయిల్‌ నోటిఫికేషన్‌ రూపంలో తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఫలితంగా ఎటువంటి తప్పులు జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. తప్పుదోవ పట్టించే కంటెంట్‌కు చిన్నారులు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రులు వారి యూట్యూబ్‌ యాప్‌ లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫ్యామిలీ సెంటర్‌ పేజీలోకి వెళ్లాలి. అనంతరం ఈ ఫీచర్‌ ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఈ వారంలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌ లోనూ ఈ ఫీచర్‌ వినియోగించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu