తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కారు పార్టీ ఎమ్మెల్యేలు సుమారు పది మంది హస్తం గూటికి చేరారు.. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఈ క్రమంలో వారిమీద అనర్హత వేటు వేయించేందుకు ఆ పార్టీ నాయకత్వం సిద్దమైంది. ఈ విషయంపై రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయిందట. మరో నెల రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ పార్టీ తరపున కోర్టుకు వెళ్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సుప్రీం కోర్టు నుంచి తీర్పు వస్తే నెలరోజుల్లోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ దూకుడుకు బీఆర్ ఎస్ తట్టుకోగలదా అన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.
తెలంగాణాలో త్వరలో ఉప ఎన్నికలు ?
August 05, 2024
0
Tags