హైదరాబాద్ లో ఈరోజు ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. నగరంలోని జూబ్లీభిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, మెహదీపట్నం , మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, రాయదుర్గం, బండ్లగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, కర్మన్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్‌లలో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. టోలిచౌకి షేక్‌పేట, మెహిదీపట్నం మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా.. రానున్న3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం - స్తంభించిన ట్రాఫిక్ !
July 05, 2024
0
Tags