అమెజాన్‌లో వాకర్‌ నోట్‌ బుక్‌ పై 57% డిస్కౌంట్‌ !

Telugu Lo Computer
0

వాకర్‌ నోట్‌ బుక్‌ ల్యాప్‌టాప్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 30 వేలు కాగా, ప్రస్తుతం ఏకంగా 57 శాతం డిస్కౌంట్‌తో రూ. 12,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750కే సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11 వేలకు పొందొచ్చు. వాకర్ నోట్‌బుక్‌ ల్యాపటాప్‌లో 14.1 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తోంది. జెమిని లేక్‌ సెలెరన్‌ ఎన్‌4020 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ బరువు 1.3 కిలోలు కాగా, 16.9 ఎమ్‌ఎమ్‌ థిక్‌నెస్‌తో డిజైన్‌ చేశారు. ఇందులో 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీని అందించారు. బ్లూటూత్ 4.0 వెర్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యటారీని అందించారు. 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన వెబ్ క్యామ్‌ను అందించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default