జూలై 15 న ఐక్యూ జెడ్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ విడుదల !

Telugu Lo Computer
0


జూలై 15 న ఐక్యూ జెడ్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించింది. ఈ ఫోన్ ను 6nm చిప్ సెట్ Dimensity 6300 తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ చిప్ సెట్ 414K+ AnTuTu స్కోర్ ను అందిస్తుందని కూడా తెలిపింది. అయితే, ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ఈ స్కోర్ ను అందించిందని తెలిపింది. అంటే, ఇది ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ అయ్యే అవకాశం ఉండవచ్చు. కాబట్టి, దీని కంటే తక్కువ ర్యామ్ కలిగిన మరో వేరియంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూడవచ్చు. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్లీక్ డిజైన్ ను కలిగి ఉంది మరియు ఆకర్షణీయమైన కలర్ లో కన్పిస్తోంది. అలాగే, ఈ ఫోన్ పై భాగంలో పెద్ద స్పీకర్ గ్రిల్ కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్ సెటప్ వుండే అవకాశం వుంది. ఇప్పటి వరకూ ఐకూ Z సిరీస్ నుండి గొప్ప ఫోన్ లను అందించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default