సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను మస్క్ తిరిగి రాసేవాడు !
June 01, 2024
0
Tags