బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని, ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. అయితే హేమ లేఖను పరిగణలోకి తీసుకోనట్టు తెలుస్తుంది. కాగా హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు సీసీబీ పోలీసులు సిద్ధమయ్యారు. రేవ్ పార్టీపై దాడులు జరిగిన సమయంలో నటి హేమా కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించగా... తాను ఆ రేవ్ పార్టీలో లేని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై సీసీబీ పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
పోలీసుల విచారణకు నటి హేమ వైరల్ ఫీవర్ అంటూ డుమ్మా !
May 27, 2024
0
Tags