ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లలో భాగంగా కస్టమర్లు ఇప్పుడు POCO M6 Pro 5G ఫోన్ ని రూ. 10 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ డిజైన్,శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాకుండా,కస్టమర్లు ఈ ధరలోనే ఫోన్ యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కూడా పొందుతారు. ప్రస్తుతం, POCO M6 Pro 5G యొక్క 4GB ,128GB వేరియంట్‌లపై ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,500 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ ఫోన్ ని రూ. 15,999కి బదులుగా రూ.10,499కి ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా రూ.500 తగ్గింపు ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ ని కస్టమర్లు ఈ ఫోన్ ని కేవలం రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా, వినియోగదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.7,600 తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, ఈ తగ్గింపు ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 50MP + 2MP వెనుక కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ,స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఇది కాకుండా, వెనుక భాగంలో ప్రీమియం గ్లాస్ డిజైన్ కూడా అందుబాటులో ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో POCO M6 Pro 5G ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
March 16, 2024
0