రిలయన్స్ జియో రూ.999 ధరకే జియో భారత్ 4జీ ఫోన్ లాంఛ్ చేసింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ఇది. జియో భారత్ ప్లాన్స్ కూడా ప్రకటించింది. జియో భారత్ ఫోన్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ కేవలం రూ.1,234 మాత్రమే. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ రూ.123. ఈ ప్లాన్స్ తీసుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెలకు 14జీబీ డేటా లభిస్తుంది. మొదటి 10 లక్షల మందికి జియో భారత్ ఫోన్ బీటా ట్రయల్ 2023 జూలై 7న ప్రారంభం అవుతుంది. మిలియన్ల కొద్దీ ఫీచర్ ఫోన్ వినియోగదారులను అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాట్‌ఫారమ్, ప్రక్రియల స్కేలబిలిటీని నిర్ధారించడానికి 6,500 మండలాల్లో బీటా ట్రయల్ కొనసాగనుంది. రిలయన్స్ జియో చాలాకాలం క్రితమే '2జీ-ముక్త్ భారత్' నినాదాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా 'జియో భారత్' ఫోన్ ఈ విజన్‌ను వేగవంతం చేయనుంది.
ఇప్పటికే ఉన్న 250 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇంటర్నెట్ ఎనేబుల్ ఫోన్‌లను పరిచయం చేయడమే జియో భారత్ లక్ష్యం. జియో భారత్ ఫోన్‌తో ఎంట్రీ-లెవల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సేవలను అందించనుంది రిలయన్స్ జియో . రిలయన్స్ రీటైల్ మాత్రమే కాదు ఇతర ఫోన్ బ్రాండ్స్ కూడా జియో భారత్ ప్లాట్‌ఫామ్ ద్వారా జియో భారత్ ఫోన్లను తయారు చేయనున్నాయి. ఇప్పటికే కార్బన్ బ్రాండ్ ఈ ప్రయాణంలో చేరింది. జియో భారత్ ఫోన్ ధర కేవలం 999 మాత్రమే. ఇంటర్నెట్ లభించే చవకైన ఫోన్ ఇదే. ఇతర ఆపరేటర్ల ఫీచర్ ఫోన్ ఆఫర్‌లతో పోలిస్తే 30 శాతం చౌక నెలవారీ ప్లాన్లు, 7 రెట్లు ఎక్కువ డేటా అందిస్తోంది జియో. రూ.123 ప్లాన్ ఎంచుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా లభిస్తుంది. ఇతర ఆపరేటర్లు రూ.179 ప్లాన్‌కు వాయిస్ కాల్స్, 2జీబీ డేటా మాత్రమే అందిస్తున్నాయి. https://t.me/offerbazaramzon