ఉద్యోగులు ఇకపై యూఏఎన్ యాక్టివేషన్, బ్యాలెన్స్ చెకింగ్ వంటి పీఎఫ్ సేవలు ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందవచ్చని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలియజేసింది. ఈ సేవలను పీఎఫ్ అధికారిక పోర్టల్ నుంచి పూర్తిగా తొలగించారు. డిజిటల్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూఏఎన్ యాక్టివేషన్ కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తిగా ఉమాంగ్ యాప్‌లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త యూఏఎన్ నంబర్ పొందాలన్నా లేదా ఇప్పటికే ఉన్న యూఏఎన్ నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలన్నా ఈ మొబైల్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ డిజిటల్ విధానాన్ని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
ఇకపై పీఎఫ్ సేవలు ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే పొందవచ్చు : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ
September 07, 2026
0
Tags