తాండూరులో 89 బస్తాల నకిలీ డీఏపీ ఎరువులు పట్టివేత

Telugu Lo Computer
0

తెలంగాణలోని తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో నకిలీ ఎరువుల బస్తాలను విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి 89 బస్తాల నకిలీ డి ఏ పి ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన పూలరాజు తండ్రి నరసింహులకు అమ్మినట్లు గుర్తించడం జరిగిందన్నారు. నకిలీ డిఏపి ఎరువులను వాడడం వల్ల రైతులు మోసపోతారు అన్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే నకిలీ బస్తాలను అధిక ధరలకు అమ్మి మోసగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. నకిలీ ఎరువులు వాడటం వల్ల పంట సరిగా పండక రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. నాణ్యతలేని రసాయనాల వల్ల భూసారం దెబ్బతిని రైతులు నిండా మోసపోతారన్నారు. నకిలీ ఎరువుల మూటలపై పిడి యాక్టివ్ నమోదు చేయడం జరుగుతుందన్నారు వారి లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. నకిలీ ఎరువులు విత్తనాలు విక్రయిస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default