ఐక్యూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 20న లాంచ్ చేస్తున్నట్లు ఐక్యూ సంస్థ తెలిపింది. ఫోన్ టీజర్ ఇమేజ్ తో టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఫాస్టర్ మరియు స్మార్టర్ ఫోన్ గా అందిస్తున్నట్లు టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా అందించి టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ వివరాలు అందించింది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ డిస్ప్లే ఉంది మరియు ఇది పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆరా రింగ్ లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ మరియు కెమెరా బాం ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కన్పిస్తోంది. సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల పరిమాణం కలిగిన 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను MediaTek Dimensity లేటెస్ట్ చిప్ సెట్ జతగా 8GB మరియు 12GB ర్యామ్ తో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా జతగా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఐకూ ఈ ఫోన్ లో కూడా ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న బిగ్ బ్యాటరీ అందించే అవకాశం ఉంటుంది. అంటే, 7,000mAh నుంచి 8,000mAh వరకు భారీ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.
0 Comments