కవిత పార్టీకి 'టీఆర్ఎస్' అనే పేరును కేటాయించడం సాధ్యం కాదు : కేంద్ర ఎన్నికల సంఘం

Telugu Lo Computer
0

తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయాలనుకుంటున్న కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీకి 'టీఆర్ఎస్' అనే పేరును కేటాయించడం సాధ్యం కాదని ఈసీ తేల్చిచెప్పింది. కవిత ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన' అనే పేరుకు క్లుప్త నామం  'టీఆర్ఎస్' అని వస్తుంది. అయితే, ఇదే పేరుతో గతంలో ఉన్న పార్టీల చరిత్ర, ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరును అనుమతించలేమని సీఈసీ లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న గుర్తింపు పొందిన పార్టీల పేర్లతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కవిత తదుపరి 15 రోజులలోపు తమ పార్టీకి మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించని పక్షంలో, కవిత దాఖలు చేసిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీనితో కవిత టీమ్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. కొత్త పేర్ల ఎంపికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default