రేపు నథింగ్​ ఫోన్ 4బీ విడుదల

Telugu Lo Computer
0

దేశీయ మార్కెట్లో నథింగ్​ ఫోన్ 4బీ రేపు విడుదల కానున్నది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం సిరీస్, మిడ్-రేంజ్ 'ఏ' సిరీస్ కంటే తక్కువ ధరలో సరికొత్త 'బీ' సిరీస్‌ని ఇండియాలో పరిచయం చేస్తోంది. ఈ మేరకు ఈ సిరీస్ నుంచి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 4బీ' విడుదల కానుంది. ఈ లాంచ్‌లో భాగంగా క్రికెట్ అభిమానుల కోసం నథింగ్ సంస్థ ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. 'నథింగ్ ఫోన్ 4బీ ఆర్సీబీ లిమిటెడ్ ఎడిషన్'ను కూడా రేపు విడుదల చేయనుంది. రెడ్ కలర్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ ప్రత్యేక ఎడిషన్ ఫోన్లు కేవలం బెంగళూరులోని నథింగ్ అఫీషియల్ స్టోర్‌లో మాత్రమే జులై 7 సాయంత్రం 4 గంటల నుంచి లభిస్తాయి. 'మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత' ప్రాతిపదికన పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని విక్రయించనున్నారు. నథింగ్ బ్రాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దాని వెనుక ఉండే ట్రాన్స్‌పరెంట్ డిజైన్, ఎల్‌ఈడీ లైట్లు. ఈ ఫోన్ 4బీలో కూడా నథింగ్ తన సిగ్నేచర్ 'గ్లిఫ్ బార్' ఇంటర్‌ఫేస్‌ను కొనసాగించింది. ఫోన్ వెనుక భాగంలో ఎడమ వైపు పైన డ్యూయల్ కెమెరా సెటప్, పక్కనే రికార్డింగ్ సమయాన్ని సూచించే చిన్న రెడ్ కలర్ ఎల్‌ఈడీ లైట్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ బ్లూ, ఆర్సీబీ రెడ్ కలర్స్‌తో పాటు బ్లాక్, వైట్, పర్పుల్ రంగులలో కూడా లభించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default