Ad Code

సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణలో పూర్తి అనుకూల పరిస్థితులు !

తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మలేషియా కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేలా ముందుకు రావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. ప్రపంచ స్థాయి 'సెమీ కండక్టర్ ఎకోసిస్టం' అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని వెల్లడించారు. హైదరాబాద్‌ను చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. సెమీ కండక్టర్, ఏఐ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణను 'గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్'గా మార్చేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పెనాంగ్‌కు ఉన్న సెమీ కండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ అనుభవం తెలంగాణకు ఉపయోగపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ - మలేషియా మధ్య సాంకేతిక, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. మలేషియా ప్రతినిధి వైబీ జగదీప్ సింగ్ దియో తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu