మైక్రోసాఫ్ట్ బిల్డ్ సెమినార్ లో డ్రీమ్ మెషీన్ విడుదల
ఆటానమస్ వర్క్‌ప్లేస్ అసిస్టెంట్స్, గాడ్జెట్స్, ఎన్విడియాతో పనిచేసే పీసీలు, ఇన్‌హౌస్ రీజనింగ్ మోడల్ వంటి అనేక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ ను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. యాప్‌లకే పరిమితం కాకుండా, ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థలను సృష్టించడమే ఈ నూతన ఆవిష్కరణల ప్రధాన లక్ష్యం. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన వార్షిక సాఫ్ట్‌వేర్ డెవలపర్ సెమినార్ 'మైక్రోసాఫ్ట్ బిల్డ్'లో వీటిని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కంప్యూటింగ్ ఒక నూతన శకంలోకి అడుగుపెడుతోందని వ్యాఖ్యానించారు. ఆపరేటింగ్ సిస్టమ్స్, యాప్‌ల కాలం ముగిసిందని, వీటి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లే ఇకపై ఇంటర్‌ఫేస్‌లుగా మారుతాయని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే తాము మార్పులకు నాంది పలికామని, క్వాల్‌కామ్‌తో కలిసి ప్రాజెక్ట్ సోలారాను ఆవిష్కరించామని అన్నారు. బిల్డ్ 2026 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ యూజర్లు, కంప్యూటర్ల మధ్య ఇకపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లే ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తాయని, క్రమంగా టెక్ ప్రపంచం మొత్తం కూడా ఈ దిశగా పయనిస్తోందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే తాము కూడా మైక్రోసాఫ్ట్ నుంచి నూతన ఇంటర్ ఫేస్ లను డెవలప్ చేశామని అన్నారు. ప్రాజెక్ట్ సోలారా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఏజెంట్-ఫస్ట్ డివైజ్ కోసం సొలారాను ఆవిష్కరించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ యాప్, వర్క్‌ఫ్లో, స్క్రీన్ వంటి డివైజ్ లల్లో సొలారా టూల్ అందుబాటులోకి రానుంది. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లకు ప్రత్యామ్నాయం. నెక్స్ట్ జెన్ మెయిన్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఆర్టిఫీషియల్ ఏజెంట్లు అవతరిస్తున్నాయని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో చిప్ టు క్లౌడ్ ప్లాట్‌ఫామ్ వీటిని ఆవిష్కరించామని, సాఫ్ట్‌వేర్, డివైజ్, వర్క్‌ఫ్లో అంతటా విస్తృతంగా పనిచేసేలా భవిష్యత్ కంప్యూటర్ల నిర్మాణ, వినియోగ తీరును మారుస్తాయని స్పష్టం చేశారు. ఈ సొలారా టూల్ కు స్క్రీన్, మైక్రోఫోన్ ఉంటాయి. ఇవి స్మార్ట్‌ఫోన్ లాగా సంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఉపయోగించబోవు. బదులుగా క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్‌లతో సంభాషించే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను శాసిస్తాయి. ఈ ఏజెంట్లను నూతన పరికరాలు, పీసీలు, సొంత ఏఐ మోడళ్లతో మైక్రోసాఫ్ట్ అనుసంధానిస్తోంది. దీని ద్వారా ఎండ్ టు ఎండ్ ఏఐ వ్యవస్థపై మరింత నియంత్రణ సాధించినట్టవుతుంది. సొలారా టూల్ ద్వారా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లను ఆకట్టుకోవాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.