వ్యవసాయాధార పరిశ్రమలకు రుణాలు పెంచాలి !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు కేవలం సాంప్రదాయ పంట రుణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రుణాల పంపిణీని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని, ఈ అవకాశాన్ని బ్యాంకులు ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో క్రెడిట్`డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 130.78 శాతం నమోదు కావడం విశేషమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంక్ డిపాజిట్లు రూ.9.43 లక్షల కోట్లుగా ఉంటే అడ్వాన్సులు (రుణాలు) రూ.12.33 లక్షల కోట్లకు చేరాయని, వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. నిర్ణీత లక్ష్యం కంటే ఎక్కువగా 102 శాతం ప్రగతిని నమోదు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరిందని, వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.1.68 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందజేశాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణ మాఫీ కార్యక్రమం వల్ల గ్రావిÖణ ప్రాంతాల్లో రుణ సంస్కృతి పునరుద్ధరణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల బ్యాంకులలో వ్యవసాయ నిరర్ధక ఆస్తులు 5.23 శాతం నుంచి 4.71 శాతానికి తగ్గాయి. తెలంగాణలో ఉద్యానవన రంగంతోపాటు ఆయిల్ పామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ రంగాలకు బ్యాంకులు పెద్దపీట వేయాలని కోరారు. పంట నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోల నిర్మాణానికి బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తగిన ఆర్థిక మద్దతు అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆధునికీకరించేందుకు, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.147.91 కోట్ల బ్జడెట్‌ను కేటాయించింది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంట రుణాలు అందేలా బ్యాంకులు బాధ్యత తీసుకోవాలన్నారు. వీటితోపాటు పర్యావరణహితమైన సోలార్ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు రుణ సదుపాయాన్ని గణనీయంగా పెంచాలని మంత్రి తుమ్మల సూచించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default