గూగుల్ జెమినీ ఏఐ నుండి ఆదాయాన్ని పొందడానికి కంపెనీ కొత్త మార్గాలను వెతికే పనిలో ఉండవచ్చని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఫిలిప్ షిండ్లర్, ఇటీవల జరిగిన ఒక ఎర్నింగ్స్ కాల్‌లో ఇన్వెస్టర్లకు , జర్నలిస్టులకు చెప్పినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్‌పేర్కొంది. జెమిని యాప్ చాట్‌బాట్‌లోకి యాడ్స్ తీసుకురావడానికి ముందు, సెర్చ్‌లో ఏ పదాలు ఉన్నాయో టెస్ట్ చేయనుందని చెబుతున్నారు. ఇండియా, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఏఐ ఆధారిత సెర్చ్ ఫీచర్,ఏఐ ఓవర్ వ్యూస్‌లో గూగుల్ ఇప్పటికే యాడ్స్‌ను తీసుకువచ్చింది. ఏఐ జనరేట్ చేసి అందించిన సమాధానాలతో పాటు ఈ యాడ్స్ కనిపించనున్నాయి. ఈ యాడ్స్, యూజర్ సమాధానానికి అనుగుణంగా కనిపించనున్నాయి. గూగుల్ విధానాన్ని పోలినట్లుగా ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. చాట్‌జీపీటీలో కూడా యాడ్స్ తీసుకువచ్చేందుకు ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. చాట్‌జీపీటీ రెస్పాన్సెస్‌ను ప్రభావితం చేయవని కంపెనీ సూచించినట్లు సమాచారం. అయితే ఈ ప్రకటనలు ఇప్పుడు ఎక్కువ మంది ఆడియెన్స్‌కు కనిపించనున్నాయి. ఒక వేళ గూగుల్ జెమిని యాప్‌లో యాడ్స్ రావడం ప్రారంభిస్తే, యాజర్స్‌కు చాట్‌బాట్‌తో సంభాషణలలో స్పాన్సర్డ్ సూచనలు లేదా ప్రమోషనల్ కంటెంట్ కూడా కనిపిస్తుంది. దీని వలన సర్వీసెస్ ఉచితంగా లభించే అవకాశం ఉంది, అయితే ఏఐ చాట్‌బాట్‌తో యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారనేది కూడా ప్రభావితమవుతుంది. ప్రస్తుతానికి టెక్ దిగ్గజం గూగుల్ జెమినీలో యాడ్స్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
0 Comments