హైదరాబాద్ పోలీసులు ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్న ముఠాపై పంజా విసిరారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు టికెట్ల విక్రయ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ క్లబ్‌ల సెక్రటరీలకు కేటాయించిన అధికారిక టికెట్లు అక్రమ పద్ధతిలో బ్లాక్ మార్కెట్‌కు మళ్లుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఒక్కో క్లబ్ సెక్రటరీకి 17 టికెట్ల చొప్పున కేటాయింపులు జరగగా, వాటిని సాధారణ ధరల కంటే భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో క్లబ్ సెక్రటరీల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐపీఎల్ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని సామాన్య అభిమానులను దోచుకుంటున్న ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
0 Comments