దేశవ్యాప్తంగా పెరుగుతున్న వడగాల్పులపై దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో వడగాల్పుల విషయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయని, దీనితో పాటు రోజువారీ జీవితంలో వేడి వలన కలిగే అనేక ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. తన తోటి పౌరులకు సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఇళ్ల నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు నీటిని తీసుకువెళ్ళాలని కోరారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న వడగాల్పులు : ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు
May 27, 2026
0
Tags