హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ‘QR కోడ్’ విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్ హెచ్ఏఐ


జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘QR కోడ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. గూగుల్ మ్యాప్స్‌లో కొన్నిసార్లు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులకు చెక్ పెడుతూ, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. హైవేపై ఉన్న మైలు రాళ్లు, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా QR కోడ్ బోర్డులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ప్రయాణికులు తమ మొబైల్ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ క్రింది వివరాలను తక్షణమే తెలుసుకోవచ్చు. ప్రయాణించే మార్గంలో ఎంత టోల్ టాక్స్ చెల్లించాలో ముందుగానే తెలుసుకోవచ్చు. మార్గమధ్యలో దగ్గరగా ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్ల వివరాలు. అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల సమాచారం. ఈ అత్యాధునిక QR కోడ్ స్కాన్ బోర్డులను ప్రస్తుతం ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సేవలను ఇప్పటికే వినియోగించుకుంటున్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ విధానాన్ని విస్తరించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సరికొత్త విధానం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post
3