ఇరాన్‌కు ఆయుధాలు పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ కు ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ సంచలన కథనం ప్రచురించింది. త్వరలోనే ఆయుధాలు ఇరాన్ చేతికి అందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, నేరుగా చైనా ఆయుధాలు అందించకుండా, మీడియేటర్ ద్వారా ఈ టాస్క్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసినట్లు నివేదించింది. ఇరాన్‌కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థ అందిస్తే చైనా పెద్ద సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోందని ట్రంప్ బెదిరించారు. ఇరాన్ కు ఆయుధాలు అందించనున్నట్లు వస్తోన్న వార్తలను చైనా తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా సంఘర్షణలో ఏ పక్షానికీ ఎన్నడూ చైనా ఆయుధాలు అందించలేదని క్లారిటీ ఇచ్చింది. నిరాధారమైన ఆరోపణలను నివారించాలని అమెరికాను కోరింది. మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ ఆరోపణలపై ప్రభావంతో ఆ పర్యటనపై ఏమైనా చూపిస్తుందో చూడాలీ.
ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తే తీవ్ర పరిణామాలు : చైనాకు ట్రంప్ హెచ్చరిక : అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసిన చైనా
April 12, 2026
0
Tags