సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ పై డీసీఎంను ఢీ కొట్టిన బిఎండబ్ల్యు కారు : డీసీఎం పల్టీ, కారు దగ్ధం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగం అజాగ్రత్తతో కారు నడిపి ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌స్పెక్టర్ కె.వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రాక్ టౌన్ కాలనీలో నివాసముండే సాయి కీర్తన్ రెడ్డి (24) సోమవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో తన బిఎండబ్ల్యు కారులో సాగర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ పై అతివేగం, అజాగ్రత్తతో కారు నడుపుతూ ముందు వెళుతున్న డి సి ఎం ను ఢీ కొట్టగా డీసీఎం పల్టీ కొట్టింది. అనంతరం ఫ్లైఓవర్ రైలింగ్ ను ఢీ కొట్టడంతో కారులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సాయికీర్తన్ రెడ్డిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default