హైదరాబాద్, వనస్థలిపురం ప్రాంతంలోని గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళను కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు కత్తి మరియు పెట్రోల్ డబ్బాతో అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు. ఘటన సమయంలో ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతురాలితో గతంలో తనకు వివాహం జరిగిందని, ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకుందని నిందితుడు చెప్పినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వనస్థలిపురంలో మహిళను హత్య చేసిన మాజీ భర్త
February 18, 2026
0
Tags