ఏసీబీ అధికారులు తనిఖీలు : తప్పించుకుని పారిపోయిన వాత్సవాయి ఎస్సై

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో వాత్సవాయి పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ దాడుల నుంచి ఎస్సై పరారయ్యారు. పోక్సో కేసులో బాధితుల నుంచి ఎస్‌ఐ లంచం డిమాండ్ చేశారు. దీంతో అధికారులను బాధితులు ఆశ్రయించారు. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు సైతం అధారాలు అందించారు. దీంతో పక్కా స్కెచ్ వేసి పోలీస్ స్టేషన్‌పై రైడ్స్ చేశారు. అయితే తనిఖీలకు ముందే కానిస్టేబుల్‌కు సమాచారం అందింది. వెంటనే ఎస్సైకు చెప్పడంతో ఆయన ఎస్కేప్ అయ్యారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default