టీవీలో యూట్యూబ్ చూసేవారు వీడియో కోసం మరింత సమాచారం కావాలంటే ఆస్క్ బటన్ క్లిక్ చేసి AI అసిస్టెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ మొబైల్ ఫోన్లలో, వెబ్సైట్ లకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో కూడా ఈ ఆప్షన్ చూడవచ్చని కంపెనీ సపోర్ట్ పేజీ ద్వారా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్ , కొరియన్ భాషలో మాత్రమే ఉంది. ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు హాలీవుడ్ రేంజ్ సినిమా విజువల్స్ ఇస్తుంది. యూట్యూబ్ ఈ ఫీచర్ ను 2024లోనే లాంచ్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక శాతం అమెరికన్లు టీవీ ద్వారా యూట్యూబ్ ను చూడడం మొదలుపెట్టారని అందుకనే ఈ ఆప్షన్ బిగ్ స్క్రీన్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. నీల్సెన్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 2025 నుండి చూస్తే యూట్యూబ్ కు 12.4% మంది టీవీ ద్వారా వీక్షించారు. ఇంకా చెప్పాలంటే దిగ్గజాలైన డిస్నీ, నెట్ ఫ్లిక్స్ ను కూడా వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ ఫైర్ టీవీ పరికరాల్లో అలెక్సను ప్రవేశపెట్టింది. రోకు తన AI వాయిస్ అసిస్టెంట్‌ను మరింత మెరుగుపరిచింది. దీనివల్ల యూజర్స్ కు ఎలాంటి సందేహాలున్నా అడగవచ్చు .
టీవీలో యూట్యూబ్ AI అసిస్టెంట్
February 21, 2026
0
Tags