ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 'బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలు అత్యధికంగా పెరిగిపోయాయి. బీహార్‌లో క్రైమ్ తారాస్థాయికి చేరుకుంది. నితీష్‌కుమార్ ప్రభుత్వం నేరస్తులను రక్షిస్తుంది. కాబట్టే వారు నిర్భయంగా ఉన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేరస్థులు చక్రవర్తులుగా మారారని మేము చెబుతూనే ఉన్నాం. నేరాలు పెరిగిపోతున్నా మన ముఖ్యమంత్రికి స్ప్పహ లేదు. ఏదైనా సంఘటన జరిగితే ప్రజలకు న్యాయం జరిగేలా ఆ అంశాన్ని లేవనెత్తడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని అవమానిస్తూనే ఉంది. అధికారంలో ఉన్న వ్యక్తులు సరైన సమాధానం ఇవ్వరు. ఎటువంటి చర్య తీసుకోరు' అని ఆయన అన్నారు.
0 Comments